చెట్టు కొమ్మకు.. పాపం పసివాడు

Published on Wed, 11/26/2025 - 07:22

తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడని, తోటి విద్యార్థులను కొడుతున్నాడంటూ.. కిండర్‌ గార్టెన్‌ (కేజీ) చదువుతున్న ఐదేళ్ల చిన్నారికి ఒక ఉపాధ్యాయిని విధించిన అత్యంత క్రూరమైన శిక్ష నివ్వెరపరిచింది. చిన్నారి టీ–షర్ట్‌కు తాడు కట్టి, పాఠశాల ఆవరణలోని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసింది. ఎవరో ఈ దృశ్యాన్ని రహస్యంగా వీడియో తీయడంతో, అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అభం శుభం తెలియని ఆ పసివాడు గాలిలో వేలాడుతూ భయంతో వణికిపోతుండగా, పక్కనే ఉన్న మరో మహిళ ఆ ఉపాధ్యాయినికి మద్దతుగా మాట్లాడటం వీడియోలో కనిపించింది. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సూరజ్‌పూర్‌ జిల్లా రామానుజ్‌ నగర్‌ బ్లాక్, నారాయణ్‌పూర్‌ గ్రామంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. 

 

 సోమవారం ఈ వీడియో క్లిప్‌ వెలుగులోకి రావడంతో,  విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. పాఠశాల యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి అజయ్‌ మిశ్రా ఆదేశించారు. వివరణ అందిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ప్రాథమిక నివేదిక ఆధారంగా, సదరు ఉపాధ్యాయినిని తక్షణమే విధుల నుంచి తొలగించారు. అయితే, పాఠశాల డైరెక్టర్‌ సుభాష్‌ శివహారే మాత్రం ఈ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను. కానీ ఉపాధ్యాయిని.. బాలుడిని బెదిరించడానికి మాత్రమే టీ–షర్ట్‌తో చెట్టుకు వేలాడదీయడానికి ప్రయత్నించింది. 

తరగతి గదిలో పిల్లలు ఇతరులను కొడుతున్నందున, వారిని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ఈ ప్రయత్నం జరిగింది’.. అని విలేకరులకు వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై మానవ హక్కుల సంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)