Breaking News

వాడు పాస్ అవ్వడు… ఎందుకు పరీక్ష రాయడం?

Published on Fri, 03/06/2026 - 11:59

చెన్నై: ‘పాస్‌ అవ్వడు’ అంటూ 10వ తరగతి విద్యారి్థకి పబ్లిక్‌ పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆ ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థి తల్లి పోలీసులకు  ఫిర్యాదుచేసిన సంఘటన కలకలం రేపింది.ç బజనై కోవిల్‌ వీధికి చెందిన రాధికా అనే మహిళ తన భర్తతో విడిపోయి జీవిస్తోంది. ఆమెకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు కాగలూరు ప్రాంతంలోని ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యారి్థకి చర్మవ్యాధి ఉండటంతో అప్పుడప్పుడు సెలవులు తీసుకుని చికిత్స పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. 

ఈ పరిస్థితిలో సెలవులు ఎక్కువగా తీసుకున్నాడనే కారణంతో అతనికి జరగబోయే 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయకూడదని, రాసినా పాస్‌ అవడని చెప్పి పాఠశాల అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదని తెలుస్తోంది. దీనిపై విద్యార్థి తల్లి రాధికా తిరువళ్లూర్‌ జిల్లా ప్రధాన విద్యా అధికారికి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు విచారణ చేసి, ఆ విద్యార్థికి పబ్లిక్‌ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

రాధికా మాట్లాడుతూ, ‘ఇప్పటికే మూడు సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో చదివిన నా కుమార్తె 10వ తరగతి పరీక్షలో ఓ  సబ్జక్ట్‌ లో ఫెయిల్‌ అయ్యిందని తర్వాత మళ్లీ పరీక్ష రాసి పాస్‌ అయ్యిందన్నారు. అయినా ఆమెను 11వ తరగతిలో చేర్చడానికి పాఠశాల వారు ఆసక్తి చూపలేదని అందువల్ల ఆమె చదువు కొనసాగించలేదు. ఇప్పుడు నా కుమారుడి పరిస్థితి కూడా అలాగే అవ్వకూడదని నేను ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు.    

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)