Breaking News

‘నేను సీజేఐని.. రూ.500 పంపండి’ అంటూ స్కామర్ మెసేజ్!

Published on Wed, 08/28/2024 - 09:40

సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడయా ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్‌ చేసి డబ్బులు అడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుంటున్నవారు.. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తాజాగా, తనను సీజేఐగా పరిచయం చేసుకొని డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది.

సీజేఐ డీ.వై చంద్రచూడ్‌లా తనను తాను ఓ సైబర్‌ నేరస్తుడు పరిచయం చేసుకుంటూ.. క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగాడు. ఈ విషయం తమ దృష్టికి రావటంతో సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. తనపేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను చేసి.. సీజేఐ అవాక్కయ్యారు. సీజేఐ డీ.వై చంద్రచూడ్‌ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది.

‘‘హలో, నేను సీజేఐని కొలీజియం అత్యవసర సమావేశానికి వెళ్లాలి. నేను కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం మీరు నాకు రూ. 500 పంపగలరా? నేను కోర్టుకు చేరుకున్న తర్వాత వెంటనే డబ్బు తిరిగి ఇస్తాను’’ అని సైబర్‌ నేరగాడు సీజేఐ పేరుతో డబ్బులు అడిగాడు. ప్రస్తుతం ఈ స్క్రీన్‌షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)