Breaking News

ఒక సెమిస్టర్‌ చదివితే.. ఏడాది కింద లెక్కించలేం

Published on Tue, 07/14/2026 - 12:24

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చేపట్టిన అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ) నియామకాల వ్యవహారంలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిగ్రీలో కనీసం ఏడాదిపాటు స్టాటిస్టిక్స్‌ చదివి ఉండాలన్న నిబంధన ఉన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్‌ (ఆరు నెలలు) మాత్రమే ఆ సబ్జెక్టును చదివిన అభ్యర్థులను అర్హు లుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. 

అభ్యర్థుల అర్హత వివా దంపై వై.జగదీష్‌ తదితరులు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. బీటెక్‌ అభ్యర్థులు తమ కోర్సులో భాగంగా ఒక సెమిస్టర్‌లో స్టాటిస్టిక్స్‌ చదివారని చెప్పారు. రాతపరీక్షలో వీరు 7వ ర్యాంకు లాంటి అత్యుత్తమ మెరిట్‌ సాధించినప్పటికీ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో టీజీపీఎస్సీ వీరిని అనర్హులుగా ప్రకటించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సెమిస్టర్‌ విధానంలో ఏడాది సిలబస్‌ను ఆరు నెలలకే కుదించి బోధిస్తారని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అకడమిక్‌ నిపుణుల కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపిందని వాదించారు.

నిపుణుల కమిటీ నివేదికే కీలకం
నిబంధనల్లో స్పష్టంగా ’ఒక ఏడాది’ అని పేర్కొన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్‌ మాత్రమే చదివితే ఆ నిబంధనను ఎలా సంతృప్తి పరుస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశంపై తెలంగాణ అకడమిక్‌ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. ఒక విద్యా సంవత్సరం అనగా 12 నెలలు లేదా రెండు సెమిస్టర్లు అని, ఫౌండేషన్‌ కోసం కేవలం ఆరు నెలలు చదివిన సబ్జెక్టును పూర్తి అకడమిక్‌ ఇయర్‌లో చదివినట్లుగా పరిగణించలేమని కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. అకడమిక్‌ అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీలదే తుది నిర్ణయమని, వారి అభిప్రాయాన్ని కాదని న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను రుద్దలేవని జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా స్పష్టం చేశారు.   

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)