Breaking News

రైల్వే ప్రమాదాల నివారణపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

Published on Tue, 01/02/2024 - 14:56

ఢిల్లీ: ఒడిశా రైల్వే ప్రమాదం తర్వాత రైల్వేలో తీసుకున్న భద్రతా ప్రమాణాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైల్వేలు అమలు చేయడానికి ప్రతిపాదించిన రక్షణ చర్యల గురించి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అటార్నీ జనరల్‌ను కోరింది. ఆటోమెటిక్ రక్షణ వ్యవస్థ 'కవాచ్'ను పాన్-ఇండియా ప్రాతిపదికన ప్రవేశపెడితే ఎదురయ్యే ఆర్థికపరమైన చిక్కుల గురించి కూడా ధర్మాసనం ప్రశ్నించింది. 

రైల్వేలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. రైల్వేలో 'కవచ్' వ్యవస్థను తక్షణమే అమలు చేయడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవాచ్)ను దేశమంతటా ఇప్పటికీ అమలు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు. 

ఒడిశాలోని బాలాసోర్‌లో గత కొద్ది నెలల క్రితం  రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ  ప్రమాదంలో సుమారు 293 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ప్రధానమైంది.

ఇదీ చదవండి: మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)