Breaking News

కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా? 

Published on Thu, 10/16/2025 - 05:32

న్యూఢిల్లీ: దేశంలో మరణ శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణ శిక్ష పడిన దోషులకు ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా శిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆక్షేపించింది. కాలానుగుణంగా మారడానికి సిద్ధంగా లేదని తప్పుపట్టింది. 

దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని రద్దు చేయాలని, ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష అమలు చేయాలని కోరుతూ సీనియర్‌ అడ్వొకేట్‌ రిషీ మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మరణ శిక్ష ఎలా అమలు చేయాలన్న సంగతి దోషికే వదిలివేయాలని పిటిషనర్‌ వాదించారు. 

ఉరిశిక్షా? లేక ప్రాణాంతక ఇంజెక్షనా?.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకొనే అవకాశం దోషికి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక ఇంజెక్షనే సరైన విధానమని పేర్కొన్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా, 49 రాష్ట్రాల్లో ఇంజెక్షన్‌ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఉరిశిక్ష అత్యంత క్రూరమైనది, అనాగరికమైనదని, దోషి ప్రాణం పూర్తిగా పోవడానికి మృతదేహాన్ని దాదాపు 40 నిమిషాలపాటు ఉరికొయ్యకు వేలాడదీస్తారని చెప్పారు. ఉరిశిక్షతో పోలిస్తే ఇంజెక్షన్‌ విధానంలో ప్రాణం త్వరగా పోతుందని, ఇది మానవీయంగా, గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.  

అది ప్రభుత్వ విధాన నిర్ణయం   
మరణ శిక్ష అమలు చేసే విషయంలో అడ్వొకేట్‌ రిషీ మల్హోత్రా సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదికి జస్టిస్‌ సందీప్‌ మెహతా స్పష్టంచేశారు. సదరు న్యాయవాది స్పందిస్తూ... శిక్ష విషయంలో దోషికి ఆప్షన్‌ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టంచేశామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ మెహతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా? అని ప్రశ్నించారు. కాలానుగుణంగా ప్రభుత్వం మారకపోవడమే అసలు సమస్య అని అన్నారు. 

దోషికి ఉరి ద్వారా మరణ శిక్ష అమలు చేయడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అఫిడవిట్‌లో ప్రస్తావించామని న్యాయవాది గుర్తుచేశారు. ఈ విషయంలో 2023 మే నెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును ప్రస్తావించారు. మరణశిక్ష ఎలా అమలు చేయాలన్నదానిపై సమీక్ష కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి పేర్కొన్నట్లు ఆ ఉత్తర్వులో కోర్టు వెల్లడించింది. కమిటీ ఏర్పాటు అంశం ఏమైందన్న సంగతిని ప్రభుత్వం వద్ద ఆరా తీస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దాంతో తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్‌ 11వ తేదీకి వాయిదా వేసింది.        

ప్రభుత్వాన్ని ఆదేశించలేం
అడ్వొకేట్‌ రిషీ మల్హోత్రా 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్‌ మొగ్గుచూపిందని పేర్కొన్నారు. 187వ నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించిందని తెలిపారు. ఇప్పుడున్నర ఉరిశిక్ష స్థానంలో తక్కువ నొప్పితో కూడిన శిక్ష విధానాలను అమల్లోకి తీసుకురావాలని వాదించారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌ లేదా తుపాకీతో కాల్చడం లేదా విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం లేదా గ్యాస్‌ చాంబర్‌లోకి పంపించడం విధానాలను సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్‌ సమర్పించింది. ఉరిశిక్షను రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. ఈ కేసులో తాజాగా మరోసారి విచారణ జరిగింది. మరణశిక్షను అమలు చేసే విషయంలో ఒక కచ్చితమైన విధానం పాటించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని ధర్మాసనం వెల్లడించింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)