Breaking News

ఈ ధర్మాసనం నుంచి తప్పించుకునే ప్రయత్నమా?

Published on Tue, 11/04/2025 - 06:18

న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ కేంద్రం చేసిన వినతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ధర్మాసనం నుంచి విచారణను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేసింది. 

విచారణ ముగింపు దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి ఇలాంటిది ఊహించలేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. 

విచారణ చివరి రోజున కేంద్రం ఇటువంటి ఎత్తుగడలకు పాల్పడుతుందని తాము ఊహించలేదని పేర్కొంది. కేంద్రం ప్రస్తుత ధర్మాసనాన్ని తప్పించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని సీజేఐ వ్యాఖ్యానించారు. సీజేఐ గవాయ్‌ ఈ నెల 23 వ తేదీన పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పిల్లేట్‌ ట్రిబ్యునల్‌ వంటి ట్రిబ్యునళ్ల రద్దు, వివిధ ట్రిబ్యునళ్లకు నియామకాలు, సభ్యుల పదవీ కాలానికి సంబంధించిన సవరణలు 2021 చట్టంలో ఉన్నాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)