Breaking News

సుప్రీంలో సీనియర్ హోదా.. కొత్త మార్గదర్శకాలు జారీ

Published on Mon, 07/17/2023 - 14:02

ఢిల్లీ: సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదుల నియామకం విషయంలో నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. భారత సుప్రీంకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదుల హోదా కోసం మార్గదర్శకాలు- 2023 పేరిట దీనిని విడుదల చేసింది సర్వోన్నత న్యాయస్థానం. కొత్తగా వయో పరిమితి విధింపుతోపాటు పలు నిబంధనలనూ చేర్చింది.

ఇందిరా జైసింగ్‌ వర్సెస్‌ సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా.. ఈ ఏడాది మే 12వ తేదీన వెల్లడించిన ఆదేశాలనుసారం ఈ మార్గదర్శకాలు విడుదల చేసినట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. ఈ కేసులో తీర్పు వెలువరించిన రెండు నెలలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం గమనార్హం.  ఇక తీర్పులో.. న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా నియమించడానికి హైకోర్టులు, సుప్రీంకోర్టు అనుసరించిన ఇంటర్వ్యూ ప్రమాణాలను కోర్టు సమర్థించింది,  

సీనియర్‌ న్యాయవాదుల కేటాయింపునకు సంబంధించి వ్యవహారాలను..  సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే కమిటీ పర్యవేక్షిస్తుందని, ఇందులో ఇద్దరు సీనియర్‌ జడ్జిలతో పాటు అటార్నీ జనరల్‌, అలాగే చైర్‌పర్సన్‌.. సభ్యులుగానీ  నామినేట్‌ చేసే ఓ బార్‌ మెంబర్‌ సైతం సభ్యులుగా ఉంటారని తెలిపింది. అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే రహస్య బ్యాలెట్ ఓటింగ్‌ను ఆశ్రయించాలని కొత్త మార్గదర్శకాలు నిర్దేశించాయి.

  •  45 ఏళ్లు నిండి ఉండాలి
  •  కనీసం పదేళ్లు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ ఉండాలి. 
  •  కనీసం 5 ఆర్టికల్స్ వేర్వేరు పబ్లికేషన్లలో ప్రచురితం కావాలి. ప్రచురణల సంఖ్యకు ఇచ్చిన పాయింట్లను 15 మార్కుల నుండి 5కి తగ్గించింది.
  •  కేసును వాదించి గెలవాలి, జడ్జిమెంట్ రావాలి
  •  న్యాయ కళాశాలల్లో బోధించిన అనుభవం పరిగణనలోకి తీసుకుంటారు
  • తీర్పుల కోసం ఇచ్చిన పాయింట్ల సంఖ్యను గతంలో 40 నుండి 50 పాయింట్లకు పెంచారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)