Breaking News

సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. సుప్రీం ఘాటు స్పందన

Published on Mon, 03/20/2023 - 14:41

న్యూఢిల్లీ: దేశంలో సహజీవనం చేసే జంట.. తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. దీన్నొక మూర్ఖపు ఆలోచనగా అభివర్ణిస్తూ పిటిషన్‌ కొట్టేశారు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. 

దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, ఈ మేరకు రిలేషన్‌షిప్‌లో ఉండే ప్రతీజంట రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే.. ఆ జంటలకు సామాజిక భద్రత కల్పించాలంటూ ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఆ ఆలోచన ద్వారా సహజీవనంలో జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు ఆ న్యాయవాది. 

అయితే.. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఘాటుగా స్పందించారు. ఎలాంటి విషయంతోనైనా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇకపై జరిమానాలు విధించడం మొదలుపెడతాం. ఏంటిది?.. రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీనవంలో ఉన్న జంటలతో కేంద్రం ప్రభుత్వానికి ఏం పని? ఏం సంబంధం అసలు? అంటూ చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏ ఉద్దేశంతో పిటిషన్‌ వేశారని న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. సోషల్‌ సెక్యూరిటీ అనే సమాధానం ఇచ్చారాయన. ఒకానొక తరుణంలో న్యాయవాదిపై ఆగ్రహం వెల్లగక్కిన సీజేఐ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు. 

ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ ఘటన.. ఆపై వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలుకా నేరాలు వెలుగులోకి రావడంతో  కేంద్రం తరపు నుంచి లివింగ్‌ రిలేషన్‌షిప్‌లపై రిజిస్ట్రేషన్‌, గైడ్‌లైన్స్‌ల కోసం తాను సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారా న్యాయవాది.

ఇదీ చదవండి: ఓటీటీ కంటెంట్‌పై కేం‍ద్రం సీరియస్‌!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)