Breaking News

ఆ విద్యార్థికి హాల్‌ టిక్కెట్‌ ఇవ్వండి

Published on Sat, 02/14/2026 - 06:15

న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల నుద్దేశిస్తూ అభ్యంతరకర మీమ్‌ను ఆన్‌లైన్‌లో సర్క్యులేట్‌ చేసినట్లు ఆరోపణలున్న ఓ పదో తరగతి విద్యార్థిని పరీక్షలు రాయనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అతడికి వెంటనే హాల్‌ టిక్కెట్‌ జారీ చేయాలని కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సరి్టఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌(సీఐఎస్‌సీఈ)ని ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ విద్యారి్థ(13) గతేడాది తమ స్కూలు ఉపాధ్యాయులపై అభ్యంతరకరమీమ్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. 

విషయం స్కూలు యాజమాన్యం దృష్టికి వచి్చంది. ఈ విషయమై సారీ చెప్పేందుకు ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడిని స్కూలు నుంచి బహిష్కరించింది. అతడి తండ్రి మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు వెళ్లగా, స్కూలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ గతేడాది నవంబర్‌లో ఆదేశాలిచి్చంది. దీనిపై అతడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఆ విద్యార్థి ఇప్పటికే సీఐఎస్‌ఈఈలో నమోదై ఉన్నందున పరీక్షలు రాయనివ్వాలని సూచించింది. లేకుంటే అతడు విద్యా సంవత్సరం నష్టపోతాడని తెలిపింది. ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు గాను హాల్‌ టిక్కెట్‌ జారీ చేయాలని సీఐఎస్‌సీఈని ఆదేశించింది. 

ఆ బాలుడికి తోటి విద్యార్థులతో కాకుండా వేరే గదిలో పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేయవచ్చని స్కూలు యాజమాన్యానికి సూచించింది. అంతేకాకుండా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఎస్‌యూపీడబ్ల్యూ (సామాజిక ఉపయోగకరమైన ఉత్పాదక పని) సబ్జెక్టులకు పాఠశాల స్థాయిలోనే అంతర్గత మూల్యాంకనాన్ని నిర్వహించాలని, ఆ మార్కులను బోర్డుకు సమరి్పంచాలని యాజమాన్యాన్ని ఆదేశించింది.

 ‘ఆ విద్యారి్థని సంస్కరించేందుకు, అంతర్గత పరివర్తన తెచ్చేందుకు ప్రయతి్నంచాల్సిన పాఠశాల యాజమాన్యం, అతడిని తొలగించడం ద్వారా దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది. అతడిని సన్మార్గంలో పెట్టే బాధ్యత కలిగిన పాఠశాల..అతడిపై చెడ్డ బాలుడనే ముద్ర వేసింది’అంటూ ధర్మాసనం ఈ సందర్భంగా మౌఖికంగా వ్యాఖ్యానించింది. బాలలు సాధారణంగా ఇటువంటి ప్రవర్తనను తమ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి నేర్చుకుంటారని ధర్మాసనం అభిప్రాయపడింది. మతపరమైన విద్వేషాలను, అందుకు సంబంధించిన అంశాలను ప్రేరేపించే మీమ్స్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని స్పష్టం చేసింది.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)