Breaking News

Supreme Court: ఆ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించాల్సిందే

Published on Thu, 08/15/2024 - 05:01

న్యూఢిల్లీ: ఖనిజ సంపన్న రాష్ట్రాలకు శుభవార్త. గనులకు సంబంధించిన రాయల్టీ, పన్నుల తాలూకు బకాయిలను కేంద్రం నుంచి వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2005 ఏప్రిల్‌ 1 నుంచీ బకాయిలను వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. 

బకాయిలను 12 ఏళ్లలోపు చెల్లించాలని కేంద్రాన్ని, వాటిపై పెనాలీ్టల వంటివేమీ విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.ధర్మాసనం తరఫున సీజేఐ తీర్పు రాశారు. ఖనిజాలు, నిక్షేపాలున్న భూములపై రాయల్టీ వసూలు అధికారం కేంద్రానిదేనన్న 1989 నాటి సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు సవాలు చేశాయి.

 గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందంటూ 8:1 మెజారిటీతో జూలై 25న ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని 1989 నుంచీ వర్తింపయాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ఒప్పుకుంటే సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు రూ.70 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి రావచ్చని తెలిపింది. కనుక తీర్పును జూలై 25 నుంచే వర్తింపజేయాలని అభ్యర్థించింది. దీన్ని ధర్మాసనం తాజాగా తోసిపుచి్చంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)