Breaking News

ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు

Published on Thu, 03/14/2024 - 06:27

న్యూఢిల్లీ:  దేశంలో రాజకీయ పారీ్టలకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది.

నిబంధనల ప్రకారం.. జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోకపోవడం వల్ల మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖరా బుధవారం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రతి బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదార్ల పేర్లు, బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్న తేదీ వంటి అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి డిజిటల్‌ రూపంలో అందజేశామని తెలిపారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)