ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి
Published on Fri, 12/29/2023 - 02:37
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు.
న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు.
#
Tags : 1