Breaking News

రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత

Published on Wed, 02/12/2025 - 09:49

అయోధ్య: యూపీలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్  కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని ఎస్‌జీపీజీటీలో చేర్చారు. ఆయన డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతూ  సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు. ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిశారు. దాస్‌ తన 20 వ ఏట ఆధ్యాత్మిక జీవితాన్ని  ఎంచుకున్నారు. అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కాయి. నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు. నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్‌ సమాచారం అందించేవారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత  భారత రాజకీయాల దిశను మార్చివేసింది. మసీదు కూల్చివేత అనంతరం కూడా దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.

ఇది కూడా చదవండి: మస్క్‌కు మరింత పవర్‌ ఇచ్చిన ట్రంప్‌.. ఉద్యోగులే టార్గెట్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)