Breaking News

తమిళనాడులో సంచలనం.. శశికళ కొత్తపార్టీ

Published on Tue, 02/24/2026 - 20:13

చైన్నై:  తమిళనాడులో ఎన్నికల వేళ మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నానని శశికళ ప్రకటించింది. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగిన సభలో పార్టీ జెండా ఆవిష్కరించింది. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్‌ గుర్తులతో జెండా ఉంది. అయితే పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని శశికళ తెలిపింది. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానంది.

అయితే ఈ రోజు ఉధయం (మంగళవారం) దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శశికళ.. త్వరలోనే ఒక శుభవార్త వింటారని బహిరంగంగా ప్రకటించారు. దీంతో రేపోమాపో శశికళ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ, కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు సర్వత్రా వినిపించాయి. ఇంతలోనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

కాగా శశికళ ,జయలలితకు అత్యంత సన్నిహితురాలు ఆమె  మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత  కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది. 

ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. తమిళనాడులో ఇదివరకే ఫిలిం స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)