Breaking News

ఢిల్లీ కమిషనర్‌గా ‘డాగ్‌ లవర్‌’ ఐఏఎస్‌!

Published on Thu, 01/22/2026 - 11:30

ఢిల్లీ: సంజీవ్ ఖిర్వార్.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. మూడేళ్ల కిందట తన పెంపుడు కుక్కల వ్యవహారంలో వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి. నాడు వాటి మార్నింగ్‌ కోసం ఏకంగా స్టేడియం ఖాళీ చేయించి వివాదంలో చిక్కుకున్నారాయన. ఈ ఘటన తర్వాత కేంద్రం ఆయన్ని బదిలీ చేసింది. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ సీన్‌లోకి వచ్చారు. 

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజీవ్‌ ఖిర్వార్‌ను ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఉన్న కమిషనర్ అశ్వనీ కుమార్‌ను జమ్మూ కశ్మీర్‌కు బదిలీ చేశారు. త్వరలో ఢిల్లీ కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమర్పణ ఉంది. సరిగ్గా దీని ముందరే.. ఖిర్వార్‌కు బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. అదే సమయంలో ఆయన డాగ్‌ లవర్‌ కావడం ఇక్కడ మరో చర్చకు దారి తీసింది. 

1994 బ్యాచ్‌ ఏజీఎంయూటీ కేడర్‌కి చెందిన ఖిర్వార్.. 2022లో ఢిల్లీ త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులను బయటకు పంపించి, తన పెంపుడు కుక్కను వాకింగ్‌ చేయించాడనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన వల్ల తాము ఇబ్బంది పడ్డామని కొందరు అథ్లెట్లు ఆనాడు మీడియా ముందు వాపోయారు కూడా. అయితే తానే తప్పూ చేయలేదని.. తానొక శునక ప్రియుడ్ని అని ఆ టైంలో గర్వంగా ప్రకటించుకున్నారాయన. 

ప్రస్తుతం వీధి కుక్కల అంశం ఢిల్లీతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు విచారణ సైతం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఖిర్వార్‌ నేతృత్వంలో కార్పొరేషన్‌ కుక్కల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)