Breaking News

Sambhal: లౌడ్‌ స్పీకర్‌ బ్యాన్‌ చేశారని..

Published on Sat, 02/22/2025 - 10:12

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో లౌడ్‌ స్పీకర్‌లను బ్యాన్‌ చేస్తూ స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఒక మౌలానా(మత పెద్ద) మసీదుపైకి ఎక్కి పెద్దగా అరుస్తూ, ముస్లిం సోదరులంతా నమాజ్‌కు రావాలని పిలుపునిచ్చారు. షాహీ జామా మసీదుపై జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కోర్టు తీర్పు అనంతరం సంభాల్‌లోని అన్ని ప్రార్థనా ‍స్థలాలు, మత ప్రదేశాలలో లౌడ్‌ స్పీకర్ల వినియోగాన్ని అధికారులు నిషేధించారు. అయితే ఇప్పుడు వీటిని ఉల్లంఘించినందున పోలీసులు ఆ మసీదుకు చెందిన ముగ్గురు మతపెద్దలపై కేసు నమోదు చేశారు. సంభాల్‌లోని షాహీ జామా ఇమామ్‌ మసీదు గత కొన్నాళ్లుగా వివాదాల్లో ఉంది. ఈ మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో కల్కి ఆలయం ఉండేందని ఒక న్యాయవాది కోర్టులో దావా వేశారు.

ఈ నేపధ్యంలో స్థానిక కోర్టు ఈ మసీదు సర్వేకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే రెండవ రోజున పెద్దసంఖ్యలో జనం మసీదు దగ్గరకు చేరుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 20 మంది పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. నాటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది.

ఇదే సమయంలో స్థానిక పరిపాలనా యంత్రాంగం అల్లర్లకు పాల్పడినవారిపై చర్యలు పట్టింది. సమాజ్‌వాదీ ఎంపీ బార్క్ కూడా ఈ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇదిలావుండగా అక్రమ విద్యుత్ కనెక్షన్‌లను తొలగించేందుకు వెళ్ళిన బృందం ఒక పురాతన ఆలయాన్ని కూడా కనుగొంది. ఆలయం చుట్టూ ఒక బావిని కూడా  వారు చూశారు. దీని తరువాత సంభాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఇంట్లో కొంత భాగం అక్రమ నిర్మాణం పరిధిలోకి వచ్చింది. దీంతో ఎంపీ ఇంటి మెట్లను సంబంధిత అధికారులు తొలగించారు.

ఇది కూడా చదవండి: Mahashivratri: కాశీ విశ్వేశ్వరుని నిరంతర దర్శనం.. 8 గంటల పాటు కల్యాణం

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)