Breaking News

50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్‌

Published on Sat, 10/12/2024 - 13:51

ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.

ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్‌కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్‌ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. 

జాగోరా,  టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.

ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)