Breaking News

శబరిమల చోరీ కేసు.. ధ్వజస్తంభాన్నీ వదలలేదు

Published on Fri, 01/16/2026 - 14:43

శబరిమల అయ్యప్ప బంగారు అభరణాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శబరిమల ప్రధాన ధ్వజస్తంభంతో  పాటు ఇతర విగ్రహాలకు సంబంధించిన బంగారం అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పి.ఎస్ ప్రశాంత్ ను అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.

శబరిమల బంగారు అభరణాల చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇదివరకే ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరుతో, ఉన్నిక్రిష్ణన్ పొట్టితో సహా ఇతరులను సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆలయ బంగారు అభరణాల పూత కేసులో మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు.

సిట్ అధికారులు జరిపిన విచారణలో ఆలయ ధ్వజస్తంభం నుంచి కూడా బంగారం చోరీకి గురయిందని అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధ్వజస్తంభానికి ఉన్న లోహాన్ని తిరిగి  వినియోగించాలి. అయితే జెండా స్తంభానికి ఉన్న బంగారం,  వాజివాహనం(గుర్రం) వంటి ఇతర విగ్రహాలతో కూడిన రిజిస్టర్ ప్రస్తుతం కనిపించడం లేదని అధికారులు తెలిపారు.

అయితే 2019లో శబరిమల గోల్డ్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే తిరిగి 2025లో బంగారు పలకాల పూత కాంట్రాక్టు అప్పగించడంపై దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడి తీరుపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు విచారించగా తిరిగి మరోసారి దర్యాప్తుకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)