Breaking News

శబరిమల ఎయిర్‌పోర్టు.. హైకోర్టు కీలక తీర్పు

Published on Sun, 12/21/2025 - 20:49

కేరళ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇ‍చ్చింది. శబరిమల గ్రీన్‌ఫీల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు చేసింది. ఎయిర్‌పోర్టు భూసేకరణ రద్దు కోరుతూ గోస్పెల్‌ ఆశియా అనే సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దానిని విచారించిన కోర్టు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కేరళ ఎరుమేలిలో నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విమానాశ్రయం కోసం 2570 ఎకరాల భూమి సేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎయిర్‌పోర్టు ఆఫ్ ఇండియా అథారిటీ ప్రకారం పెద్ద విమానాశ్రయాల నిర్వహణకు సైతం 1200 ఎకరాల భూమి సరిపోతుందని నియమం ఉంది. ఈ నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్వహణ కోసం అంత పెద్దమెుత్తంలో భూసేకరణ ఎందుకు జరుపుతున్నారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.

అయితే భవిష్యత్తు అభివృద్ధి కోసం స్థల సేకరణ చేపడుతున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీనికి సంతృప్తి చెందని కోర్టు స్థల సేకరణ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఎరుమేలిలో నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శబరిమల అయ్యప్ప సన్నిధానానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని భావించింది. కోర్టు తీర్పుతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి బ్రేక్ పడింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)