Breaking News

బయట ఏమైనా చేసుకోండి కానీ..

Published on Sat, 08/01/2026 - 14:22

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రుగుతున్న తీరుపై నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) ఎంపీ సాయోని ఘోష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కార‌ణంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌లేక‌పోతున్నామ‌ని అన్నారు. వ‌రుస అంత‌రాయాల కార‌ణంగా ప్ర‌జా ధ‌నం వృధా అవుతోందని పేర్కొన్నారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్ల‌మెంట్ స‌జావుగా సాగేందుకు అధికార‌, విప‌క్షాలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

''పార్ల‌మెంట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. ప్రతిరోజూ సభకు అంతరాయం కలుగుతోంది, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలో గానీ, జీరో అవర్‌లో గానీ మా నియోజకవర్గ సమస్యలను లేవనెత్తలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరం, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను వినిపించాలని మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సభను సజావుగా పనిచేయనివ్వాల‌ని అభ్య‌ర్థిస్తున్నాను. బయట మీరు ఏమైనా చేసుకోండి, కానీ సభ లోపల పార్లమెంటును సజావుగా నడపడం అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరి బాధ్యత''ని ఎంపీ సాయోని ఘోష్ (Saayoni Ghosh) అన్నారు. 

ప్రతిదాన్నీ గుడ్డిగా ఆమోదించాలా?
కార్యకలాపాలు సజావుగా సాగడం కోసం కాకుండా, జవాబుదారీతనం కోసం పార్లమెంటు పనిచేయాలని నెటిజ‌న్ ఒక‌రు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ కోరుకున్న ప్రతిదాన్నీ గుడ్డిగా ఆమోదించడానికి పార్లమెంటు లేదని స్ప‌ష్టం చేశారు.'' ప్రజల ఆందోళనలను లేవనెత్తడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, అత్యవసర సమస్యలను జాతీయ ప్రాధాన్యతగా మార్చడానికి ప్రతిపక్షం ఉంది. తీవ్రమైన సమస్యలను విస్మరిస్తున్నప్పుడు, అంతరాయం కలిగించడం అనేది కేవలం "సమయం వృధా" కాకుండా, ఒక రాజకీయ సాధనంగా మారుతుంది. ఎంపీలు మౌనంగా ఉండటానికో, పక్షాలు మారడానికో, లేదా తాము ఎన్నుకున్న పార్టీనే బలహీనపరచడానికో ప్రజలు ఓటు వేయలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పడంలో విఫలమైనప్పుడు తమ గొంతు వినిపించడం కోసమే వారు ఓటు వేశార''ని ఎక్స్‌లో కామెంట్ చేశారు. 

సాయోని ఘోష్‌పై విమ‌ర్శ‌లు
కాగా, ప‌శ్చిమ బెంగాల్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత పార్టీ మారిన సాయోని ఘోష్‌పై తృణమూల్ కాంగ్రెస్ మ‌ద్దతుదారులు మండిప‌డుతున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ నెత్తిన పెట్టుకుంటే ఆమెపైనే తిరుగుబాటు చేసి పార్టీ ఫిరాయించింద‌ని ఫైర్ అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాఘ‌వ్ చ‌ద్దాపై విమ‌ర్శ‌లు చేసిన ఆమె.. ఇప్పుడు అదే ప‌ని చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. క‌ష్ట‌కాలంలో మ‌మ‌త‌కు అండగా నిల‌బ‌డాల్సింది పోయి, వెన్నుపోటు పొడుస్తావా అంటూ తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌డుతున్నారు. 

చ‌ద‌వండి: ఇథ‌నాల్ పెట్రోల్‌ స్కామ్‌ను బ‌య‌ట‌పెడ‌తా

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)