Russia-Ukraine war: రష్యా యుద్ధక్షేత్రంలో మరో భారతీయుడు మృతి

Published on Tue, 07/30/2024 - 05:02

చండీగఢ్‌: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యారు. రవాణా విధులకని తీసుకున్న రష్యా యుద్ధంలోకి పంపి తన సోదరుడిని పొట్టనబెట్టుకుందని హరియాణాకు చెందిన అజయ్‌ మౌన్‌ అనే వ్యక్తి సోమవారం ప్రకటించారు. బాధితుడు రవి మౌన్‌ జనవరి 13న రష్యా వెళ్లారు. కందకాలు తవ్వడంలో శిక్షణ ఇప్పించి నేరుగా యుద్ధక్షేత్రంలోకి పంపారని అజయ్‌ ఆరోపించారు. 

రవిని రష్యాకు పంపేందుకు ఎకరం భూమి అమ్మడంతోపాటు రూ.11.50 లక్షలు ఖర్చుపెట్టామని వాపోయారు. రవి మరణవార్తను మాస్కోలోని భారతీయ ఎంబసీ ధ్రువీకరించింది. యుద్ధంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపేస్తామంటూ ప్రధాని మోదీ పర్యటన వేళ రష్యా ప్రకటించిన కొద్దిరోజులకే ఈ విషాదం వెలుగుచూడటం గమనార్హం. 

యుద్ధంలో పనిచేయడం రవికి సుతరామూ ఇష్టంలేదని, ఫోన్‌లో ముభావంగా మాట్లాడేవారని మార్చి 12వ తేదీ దాకా అతనితో టచ్‌లోనే ఉన్నామని సోదరుడు అజయ్‌ చెప్పారు. మృతదేహం గుర్తింపు కోసం డీఎన్‌ఏ నమూనాలను పంపాలని డిమాండ్‌ చేస్తున్నారని, అంత సొమ్ము తమ వద్ద లేదని, మృతదేహం రప్పించేందుకు భారత సర్కార్‌ సాయం చేయాలని ఆయన వేడుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)