Breaking News

మరాఠీయే ముంబై భాష

Published on Fri, 03/07/2025 - 14:57

ముంబై: ముంబైలో మరాఠీ భాష తప్పనిసరేం కాదన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) నాయకుడు సురేష్‌ భయ్యాజీ జోషి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంవీయే కూటమి మండిపడింది. మరాఠీ ముంబై భాష అంటూ గురువారం దక్షిణ ముంబైలోని హుతాత్మ చౌక్‌ వద్ద నిరసన నిర్వహించింది. ఈ నిరసనలో శివసేన (యూఈటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ నాయకులు విజయ్‌ వడేట్టివార్, భాయ్‌ జగ్‌తాప్, నితిన్‌ రౌత్‌ మరియు ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ సహా పలువురు ఎంవీయే కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, మరాఠీ ముంబై భాష అని నొక్కి చెబుతూ నినాదాలు చేశారు. 

బుధవారం ఘట్కోపర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ.... ‘ముంబైకి ఒకే భాష అంటూ ఏమీ లేదు. ముంబైలోని ప్రతి ప్రాంతానికి భాష మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఘట్కోపర్‌లో గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి మీరు ముంబైలో నివసిస్తున్నంత మాత్రాన మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు‘ అన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు కూటమి అగ్రనేతలతో కలిసి నిరసన చేపట్టారు  

నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు...జోషి 
తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శలకు బదులుగా జోషి‘వారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరాఠీ మహారాష్ట్ర భాష, ముంబై భాష కూడా. ఈ విషయంలో ద్వంద అభిప్రాయాలేమీ లేవు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ముంబైలో సామరస్యంగా జీవిస్తారు.మరాఠీ నా మాతృభాష. అందుకు నేను గర్విస్తున్నాను. బయటిప్రాంతాల ప్రజలు కూడా మరాఠీని అర్థంచేసుకోవాలన్నదే నా అభిప్రాయం.’అని ముక్తాయించారు.  ఎంవీయే అగ్రనేతలు
   

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)