Breaking News

ఆర్ఎస్ఎస్‌ను అలా చూడద్దు.. మోహన్ భగవత్

Published on Sun, 12/21/2025 - 17:50

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు ఎటువంటి రాజకీయ అజెండా లేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం కోల్‌కతాలో జరిగిన సంఘ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంఘ్‌ గమ్యాలను బీజేపీ దృష్టికోణంతో చూస్తున్నారని ఇది చాలా తప్పని మోహన్ భగవత్ హెచ్చరించారు.

ప్రస్తుతం కాషాయపార్టీ హవా దేశవ్యాప్తంగా నడుస్తోంది. వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయడంతో పాటు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే చాలా మంది బీజేపీకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్ఎస్ఎస్‌ పనిచేస్తుందంటుంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండింటి భావజాలాలు దాదాపు ఒకటే అని అంటుంటారు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు.

స్వయంసేవక్ సంఘ్ భావనలను సంకుచిత భావజాలంతో చూడడం చాలా తప్పని మోహన్ భగవత్ అన్నారు. "చాలా మంది బీజేపీ దృష్టితో సంఘ్‌ని చూస్తారు. ఇది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్‌కు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం హిందూ సమాజం రక్షణ అభివృద్ధి కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది". అని ఆయన తెలిపారు. సంఘ్ ప్రజలను ఉన్నతమైన వ్యక్తులుగా మారేలా చేస్తోందని వారిలో నైతిక విలువలు పెంపోందించేలా శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. తద్వారా వారు భారతదేశ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని  అన్నారు. 

సంఘ్‌ కార్యకలాపాలన్ని దేశం బాగు కోసం హిందు సమాజ రక్షణ కోసం ఉంటాయి. అయితే చాలా మంది సంఘ్‌ను ముస్లిం వ్యతిరేకిగా భావిస్తారని కాని అది అవాస్తవమని తెలిపారు. భారత్ మరోసారి విశ్వగురుగా మారుతుందని ఆ విధంగా సమాజాన్ని రూపొందించడం ఆర్ఎస్ఎస్ బాధ్యతని  మోహన్ భగవత్ పేర్కొన్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)