Breaking News

సంఘ్ కోరితే తప్పుకుంటా.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 02/08/2026 - 16:14

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రిటైర్మెంట్ కావాలని సంఘ్ ఆదేశిస్తే వైదొలగడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.  అయితే చరిత్రలో ఇంతవరకూ  సర్వ సంఘ్ చాలక్‌ని పదవీ విరమణ చేయాలని సంఘ్ కోరలేదన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు.

ఆర్ఎస్‌ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర  మంబై వర్లిలో ప్రత్యేక కార్యక్రమన్ని నిన్న( శనివారం) ప్రారంభించారు. దానికి హాజరైన మోహన్ భగవత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. RSS సంఘ్ చాలక్ పదవికి ఎన్నికలు ఉండవన్నారు.అయితే వయస్సుతో సంబంధం లేకుండా తనను పని చేయాలని సంఘ్ కోరినట్లు తెలిపారు. తన చివరి రక్తపు బొట్టువరకూ సంఘ్ తనతో పనిచేయించుకుంటుందని తెలిపారు. 
 

అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై మోహన్ భగవత్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అక్కడి హిందు సమాజం వారి హక్కులను కాపాడుకోవడానికి పోరాడదలుచుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి అండగా నిలుస్తారన్నారు. ప్రస్తుతం అక్కడి హిందూ జనాభా 1.25 కోట్ల హిందూ జనాభా ఉందని తెలిపారు.

అదేవిధంగా ఇటీవల కేంద్రం చేపట్టిన SIR ప్రక్రియలో దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలు సైతం అక్రమ చొరబాటు దారులపట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి ఎటువంటి ఉపాధి కల్పించకూడదని తెలిపారు. వారి సమచారం గుర్తిస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలన్నారు.

బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందువులపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా భారత్‌లో తలదాచుకున్న మెుదలు అక్కడే అల్లరిమూకలు రెచ్చిపోయాయి. హిందువులపై ఇష్ఠారీతిన దాడి చేశాయి.  ఇటీవల ఆ అక్కడి స్టూడెంట్ లీడర్ ఉస్మాన్‌ హాదీ హత్యతో మరోసారి అక్కడి హిందువులపై హింస చెలరేగింది. ఇస్లాం వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారనే నెపంతో అక్కడి మతఛాందస వాదులు వారిపై దాడులు చేసి చంపారు. అయితే తాజాగా వీటిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు