Breaking News

రూ. 14 వేల ఫ్లైట్‌ టిక్కెట్‌ ఛార్జీకి రిఫండ్‌గా 2 కప్పుల చాయ్!

Published on Wed, 07/12/2023 - 12:26

ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లోఫ్లైట్‌ టిక్కెట్‌ క్యాన్సిల్‌ చేయాల్సివస్తే ఎంత రిఫండ్‌ వస్తుందోనని ఆందోళనపడుతుంటాం. టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జెస్‌ ఎంత ఉంటాయోనని అనుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో టిక్కెట్‌ ఛార్జీలోని సగం మొత్తం అయినా రిఫండ్‌ రూపంలో మనకు అందదు. 

బీహార్‌ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి రాహుల్‌ కుమార్‌కు ఫ్లయిట్‌ టిక్కెట్‌ రిఫండ్‌ విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. రాహుల్‌ కుమార్‌ రూ. 13,820కు ఫ్లైట్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకుని, అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్‌ చేసుకోగా, అతనికి రిఫండ్‌ రూపంలో కేవలం రూ. 20 చేతికి అందింది. అంటే రెండు కప్పుల చాయ్‌ పైసలు రిఫండ్‌ రూపంలో తిరిగి వచ్చాయి.

ఏదైనా పెట్టుబడుల  పథకం ఉంటే..
ఐఎస్‌ అధికారి రాహుల్‌ కుమార్‌ ఫైట్‌ టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేశారు. తాను విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న అనంతరం ఎయిర్‌లైన్స్‌.. ఫ్లైట్‌ క్యాన్సిలేషన్‌ రిఫండ్‌ ఆఫ్‌ టిక్కెట్‌ను ఆయనకు పంపింది. దానిలో టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జీ రూ.11,800, జీఐ క్యాన్సిలేషన్‌ ఛార్జీ 1,200గా ఉంది. కన్వీనియన్స్‌ ఛార్జీలు  రూ. 800. మొత్తంగా క్యాన్సిలేషన్‌ ఫీజు 13,800. ఫలితంగా రాహుల్‌ కుమార్‌కు  రిఫండ్‌ రూపంలో కేవలం రూ.20 తిరిగి వచ్చాయి. దీనికి క్యాప్షన్‌గా ఆయన తనకు రిఫండ్‌ అయిన ఈ మొత్తంతో ఏదైనా పెట్టుబడుల  పథకం ఉంటే తెలియజేయాలని వ్యంగ్యంగా కోరారు. రాహుల్‌ కుమార్‌ పోస్టుకు 5 లక్షలకు మించిన వ్యూస్‌ వచ్చాయి. 5 వేలకుపైగా లైక్స్‌ వచ్చాయి. యూజర్స్‌ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
 

ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)