Breaking News

రూ.12 వేల కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో తరలిస్తుండగా..

Published on Sun, 05/14/2023 - 09:12

కొచ్చిన్‌: భారత సముద్ర జలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.12 వేల కోట్ల విలువైన సుమారు 2,500 కిలోల మెథాంఫెటమైన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌(ఎన్‌సీబీ) స్వాధీ­నం చేసుకుంది. కేరళ తీరంలోని భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి ఈ మత్తు పదార్థం ఉన్న 134 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) సంజయ్‌ కుమార్‌ సింగ్‌ శనివారం మీడియాకు తెలిపారు.

అఫ్గానిస్తాన్‌ నుంచి అక్రమంగా తరలించే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్‌ సముద్రగుప్త్‌ పేరుతో నేవీ, ఎన్‌సీబీ కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఒక పాకిస్తానీని అదుపులోకి తీసుకున్నామన్నారు. అఫ్గానిస్తాన్‌ నుంచి డ్రగ్స్‌తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్‌ తీరం వెంబడి పాక్, ఇరాన్‌ల మీదుగా డ్రగ్స్‌ను చిన్న పడవల్లోకి పంపిణీ చేసుకుంటూ వస్తోందని చెప్పారు.

మట్టన్‌చెర్రీ వద్ద ఈ ఓడను అడ్డగించినట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్‌ను చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 3,200 కిలోల మెథాంపెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషి­ష్‌ను పట్టుకున్నట్లు తెలిపారు.
చదవండి: గగన్‌యాన్‌.. క్రూమాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టం ఆపరేషన్‌ విజయవంతం

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)