Breaking News

ఒక రోడ్డు... కొన్ని చెట్లు

Published on Tue, 07/01/2025 - 08:43

పట్నా: నల్లగా నిగనిగా మెరిసిపోతున్న సువిశాలమైన, నున్నని తారు రోడ్డు. చూద్దామన్నా ఎక్కడా ఒక్క గుంత కూడా లేదు. రెండువైపులా ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్న చెట్లు. అలాంటి రోడ్డుపై యమా స్పీడుతో దూసుకుపోవాలని ఎవరికి మాత్రం ఉండదు! అలా వెళ్లే క్రమంలో ఆ చెట్లే ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైతే? బిహార్‌లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. పట్నాకు కేవలం 50 కి.మీ. దూరంలోని జెహానాబాద్‌లో రూ.100 కోట్ల వ్యయంతో ఓ రోడ్డును సువిశాలంగా విస్తరించారు. కానీ ఏడున్నర కి.మీ. పొడవైన ఆ రోడ్డు మధ్య ఒకచోట ఏపుగా పెరిగిన చెట్లను ఇదుగో, ఇలా వదిలేశారు. 

ఇదేం అనాలోచితమైన పనంటారా? దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ దాగుంది. ఈ చెట్లను తొలగిస్తామంటూ రోడ్డు నిర్మాణ సమయంలో జిల్లా యంత్రాంగం అటవీ శాఖను సంప్రదించింది. అందుకు శాఖ తొలుత అనుమతి నిరాకరించింది. పదేపదే కోరిన మీదట, ఏకంగా 14 హెక్టార్ల మేరకు అటవీ భూమికి సమానమైన పరిహారం కోరింది. అంత మొత్తం సమర్పించుకోవడం తమవల్ల కాదంటూ జిల్లా యంత్రాంగం చేతులెత్తేసింది. అలాగని ప్రాజెక్టును పక్కన పెట్టడానికి కూడా మనసు రాలేదు. దాంతో అటవీ నిబంధనలను ఉల్లంఘించకుండా చెట్లను ఇలా రోడ్ల మధ్యే వదిలేస్తూ పని పూర్తి చేసి చేతులు దులుపుకుంది.

 ఇప్పుడు ఆ రోడ్డుపై ప్రయాణం జనానికి అక్షరాలా ప్రాణాంతకంగా మారింది. ఎందుకంటే ఆ చెట్లు రోడ్డుపై కనీసం ఒక వరుసలో కూడా కాకుండా ఇక్కడొకటి, అక్కడొకటి అన్నట్టుగా చెల్లాచెదురుగా ఉండిపోయాయి. వాటిగుండా పోవాలంటే వాహనాలను నానా వంపులూ తిప్పుతూ విచిత్రమైన ఫీట్లు చేయాల్సిందే. 

ఆ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కూడా. దాంతో చూస్తుండగానే ఇది మృత్యుమార్గంగా మారిపోయింది. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఇప్పటికీ ఈ చెట్ల బెడదను తప్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. మన దేశంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమికి ఇది మరో తిరుగులేని ఉదాహరణ అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు