Breaking News

Hijab: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు

Published on Mon, 12/25/2023 - 08:24

బెంగళూరు :కర్ణాటకలో హిజాబ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌ నిషేదంపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని చాలా లోతుగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

ఇటీవల ఒక పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడూతు సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో హిజాబ్‌పై మళ్లీ చర్చ స్టార్టైంది. తమ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేదాన్ని ఇంత వరకు ఎత్తివేయలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు. 

ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ స్పందించింది. అసలు రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేదమే లేనప్పుడు దాన్ని ఎలా ఎత్తివేస్తారని మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రశ్నించారు. డ్రెస్‌ కోడ్‌ అమలులో ఉన్న కొన్ని చోట్ల మాత్రమే హిజాబ్‌ను అనుమతించడం లేదని మిగిలిన చోట్ల అంతా మామూలేనని బొమ్మై అన్నారు. 

మరోపక్క హిజాబ్‌ నిషేదంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేదం ఎత్తివేస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ  మాట తప్పిందని విమర్శించారు. ఇంకా దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని మండిపడ్డారు.  

ఇదీచదవండి..చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)