కూలిన పైకప్పు.. నిద్రలోనే కన్నుమూసిన దంపతులు

Published on Mon, 08/03/2026 - 10:24

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈశాన్య డిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో ఇల్లు కూలి దంపతులు దుర్మరణం చెందగా, రాజౌరి గార్డెన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలు భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి.

ఉస్మాన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జేపీ నగర్, గన్వారీ ఎక్స్‌టెన్షన్‌లో ఈ దారుణం జరిగింది. రాత్రి పది గంటల ప్రాంతంలో ఒకే అంతస్తు ఉన్న ఇంటర్‌లాక్ ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. వారిని ఉత్తరప్రదేశ్ లోని ఎటావాకు చెందిన టింకూ (32), ఊర్మిళ (30) దంపతులుగా గుర్తించారు.

టింకూ నగరంలో హల్వాయ్‌గా పనిచేస్తున్నారు. వీరు అద్దెకు ఉంటున్న ఈ సింగిల్ స్టోరీ భవనపు పైకప్పు స్లాబ్ అకస్మాత్తుగా కూలడానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్న దంపతుల చిన్న కుమారుడు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాడు.

మరోవైపు, రాజౌరి గార్డెన్ హరినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల నివాస భవనంలో బేస్‌మెంట్‌లోని షాఫ్ట్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ భవనం అంతటికీ వ్యాపించడంతో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు, ప్రాణాలను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి ఓ చీరను తాడులా ఉపయోగించి ఇద్దరు మహిళలు, మూడేళ్ల చిన్నారి కిందికి దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని అరగంటలోపు మంటలను అదుపులోకి తెచ్చాయి.

ఇది కూడా చదవండి: వేడి కూరలో పడి చిన్నారి దుర్మరణం

#

Tags : 1

Videos

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)