Breaking News

రామాయణంపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్‌

Published on Fri, 06/16/2023 - 21:15

పాట్నా: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఇదిలా ఉండగా.. రామాయ‌ణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్‌లాల్ యాద‌వ్ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. రామాయ‌ణాన్ని మ‌సీదులో రాశార‌ని ద‌న‌పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌లు పొలిటికల్‌గా దుమారం రేపుతున్నాయి. ఇక, యాదవ్‌ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. యాద‌వ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని భాగ‌స్వామ్య పార్టీ జేడీ(యూ) పేర్కొంది. 

యాదవ్‌ అంతటితో ఆగకుండా 11 ఏండ్ల ముస్లిం బాలిక భ‌గ‌వ‌ద్గీత‌ను ప‌ఠించి మెడ‌ల్‌ను గెలుచుకున్న‌ప్పుడు హిందుత్వవాదులు నోరుమెద‌ప‌లేద‌ని అన్నారు. ఈ విష‌యాన్ని బీజేపీ నేత‌లెవ‌రూ ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌ని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు.. యాదవ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

ఇది కూడా చదవండి: పొలిటికల్‌ స్టంట్‌.. కాంగ్రెస్‌కు బిగ్‌ ఆఫరిచ్చిన ఆప్‌

#

Tags : 1

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)