Breaking News

ఆర్‌జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం

Published on Thu, 10/03/2024 - 10:01

ముంగేర్‌: బీహార్‌లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ యాదవ్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు.  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంకజ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్స్‌లో పంకజ్‌ యాదవ్‌ మార్నింగ్ వాక్ చేస్తున్న  సమయంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే పంకజ్‌యాదవ్‌ కింద పడిపోయారు. స్థానికులు అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పంకజ్‌యాదవ్‌ ఛాతీ దగ్గర బుల్లెట్ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు  అన్నిప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు.  బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, ముంగేర్ ఘటన బాధాకరమని, దోషులను తప్పకుండా పట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇది కూడా చదవండి: బహ్రాయిచ్‌లో పట్టుబడిన చిరుత

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)