Breaking News

ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు

Published on Thu, 10/26/2023 - 14:07

ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. 

తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన  పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. 

ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్‌ఐఆర్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: ‘రెడ్‌ లైట్‌ ఆన్‌- వెహికిల్‌ ఆఫ్‌’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు?
 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)