Breaking News

‘ఆర్జీకర్‌’ కేసు..బెంగాల్‌ హైకోర్టు కీలక నిర్ణయం

Published on Wed, 01/22/2025 - 13:45

కోల్‌కతా:పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా ఆర్జీకర్‌ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో అప్పీల్‌ను కోల్‌కతా హైకోర్టు బుధవారం(జనవరి22) విచారించింది. బెంగాల్‌ ప్రభుత్వం వేసిన ఈ అప్పీల్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషి సంజయ్‌రాయ్‌ శిక్షపై అందరి వాదనలు విన్నాకే అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.

సంజయ్‌రాయ్‌కి శిక్ష సరిపోదని బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ, బాధితురాలి కుటుంబం, దోషి వాదనలు విన్న తర్వాతనే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సోమవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. 

అయితే ఈ కేసులో అప్పీల్‌ వేసే అధికారం తమకే ఉందని, బెంగాల్‌ ప్రభుత్వానికి లేదని సీబీఐ హైకోర్టుకు తెలపడం గమనార్హం. ఈ విషయంలోనూ హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

మరోవైపు సంజయ్‌రాయ్‌ శిక్షపై ట్రైనీ డాక్టర్‌ తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు బుధవారమే విచారించనుంది.

సంజయ్‌రాయ్‌కి జీవిత ఖైదు మాత్రమే విధించడంపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో కోల్‌కతాలో మళ్లీ ఆందోళనలు జరుగుతున్నాయి. రాయ్‌కి మరణశిక్ష విధించాలన్న డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది.

ఇదీ చదవండి: ఆర్జీకర్‌ కేసుపై ‘సుప్రీం’లో నేడు విచారణ 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)