Breaking News

ఆర్‌జీ కర్‌ ఘటనకు ముందే...

Published on Tue, 03/25/2025 - 07:10

కోల్‌కతా: దేశాన్ని కుదిపేసిన ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి హత్యాచార బాధితురాలైన ట్రెయినీ వైద్యురాలు ఆ ఘటనకు ముందు నుంచే తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడినట్టు మోహిత్‌ రణ్‌దీప్‌ అనే సైకియాట్రిస్టు తెలిపారు. ఆస్పత్రిలో జరిగే అవకతవకలతో పాటు సుదీర్ఘ పనివేళలు, షిఫ్టుల కేటాయింపులో వివక్ష వంటివి ఆమెను తీవ్ర ఇబ్బందులకు, ఒత్తిళ్లకు లోను చేసినట్టు వివరించారు. 

ఆయన సోమవారం ఒక బెంగాలీ టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘‘హత్యాచారోదంతానికి నెల ముందు ఆమె నన్ను సంప్రదించింది. ఒక్కోసారి వరుసగా 36 గంటలపాటు డ్యూటీ చేయాల్సి వచ్చేదని వాపోయింది. అందరికీ అలాగే వేస్తారా అని అడిగితే లేదని చెప్పింది. వీటికితోడు ఆస్పత్రికి అవసరమయ్యే వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలులో భారీ అవకతవకలు ఆమెను ఎంతగానో కలతకు గురిచేశాయి. తనకు పలు సలహాలిచ్చా. 

ఆమె మరోసారి కౌన్సెలింగ్‌కు రావాల్సి ఉండగా ఆలోపే ఘోరానికి బలైపోయింది’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఇందుకు సంబంధించి సీబీఐ ముందు వాంగ్మూలమిచ్చేందుకు కూడా సిద్ధమన్నారు. గత ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్‌ హాల్లోనే ఆమె అత్యాచారానికి, హత్యకు గురవడం తెలిసిందే. ఈ ఘటనలో సంజయ్‌ రాయ్‌ అనే పౌర వలెంటీర్‌ను దోషిగా కోర్టు నిర్ధారిస్తూ అతనికి జీవితఖైదు విధించింది. ఈ ఘోరం వెనక పలువురు పెద్దల హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, తోటి వైద్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో అవకతవకల్ని ప్రశ్నించినందుకే ఆమెపై కక్ష కట్టినట్టు చెబుతున్నారు. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)