Breaking News

RG Kar Medical Hospital: బెంగాల్‌లో కొనసాగుతున్న వైద్యుల రాజీనామాలు

Published on Fri, 10/11/2024 - 05:51

కోల్‌కతా: ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్‌ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. 

కోల్‌కతాలోని ఆర్‌.జి. కర్‌ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్‌ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి డాక్టర్‌ గౌతమ్‌ దాస్‌ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు.  పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు.

 రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్‌ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్‌.జి.కర్‌ మెడికల్‌ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన 54 మంది సీనియర్‌ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 ఆ తరువాత సిలిగురిలోని నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్‌ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)