Breaking News

సీబీఐకి ఆర్జీకర్‌ కాలేజి ప్రిన్సిపల్‌ అవినీతి కేసు

Published on Fri, 08/23/2024 - 16:45

కలకత్తా:  మహిళా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కలకత్తా ఆర్జీ కర్‌ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌కు షాక్‌ తగిలింది. ఆయనపై అవినీతి ఆరోపణల  కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం(ఆగస్టు23) సిట్‌ను ఆదేశించింది.

ప్రస్తుతం ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తోంది. సీసీటీవీ ఫుటేజీలు, కేసు డైరీతో సహా అన్ని వివరాలను శనివారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందించాలని సిట్‌కు హైకోర్టు సూచించింది. ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ రాజీనామా చేశారు. అనంతరం ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

అనాథ శవాల దందా, వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని రీసైక్లింగ్‌ చేసి సొమ్ము చేసుకొనేవారని ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనలో సందీప్‌ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. ఈ విచారణ సమయంలో ఘోష్‌ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.  దీంతో త్వరలోనే మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో పాటు మరో నలుగురికి సీబీఐ పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించనుంది.

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)