Breaking News

RG Kar Case: చర్చలపై సందిగ్ధం

Published on Wed, 09/11/2024 - 16:10

కోల్‌కతా: ఆర్‌జీ కర్‌ జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై 33 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న వైద్యులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. బెంగాల్‌ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం సచివాలయం(నబన్న)లో ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే.. 

చివరి నిమిషంలో(5.23ని. టైంలో) ఆ భేటీని లైవ్‌ టెలికాస్ట్‌ చేయించాలని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్‌ ద్వారా డిమాండ్‌ చేశారు.  ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రతినిధులు హాజరుకావాలని నిరసన చేపట్టిన వైద్యులు ప్రధాన షరతుగా పెట్టారు. ఈ చర్చలను బహిరంగ వేదికగా జరపాలని మరో కండీషన్‌గా పెట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ చర్చలకు హాజరుకావాలని.. వీటిని లైవ్‌లో ప్రసారం చేయాలని కోరారు. చర్చల్లో పారదర్శకత కోసమే తాము ఇలా కోరుతున్నట్లు  స్పష్టం చేశారు. 

వైద్యులలో 12 నుంచి 15 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ సమావేశానికి రావాలంటూ సీఎస్‌ మనోజ్‌ పంత్‌ పేరిట ఆహ్వానం వెళ్లింది. అయితే  30 మంది బృందం చర్చలకు వెళ్తామని వైద్యులు అంటున్నారు. ఈ డిమాండ్లతో సాయంత్రం 6గం. లకేప్రారంభం కావాల్సిన చర్చలపై సందిగ్ధం నెలకొంది. 

అంతకంటే ముందే.. సీఎం మమతా బెనర్జీతో  చర్చలకు తామూ సిద్ధమంటూ వైద్యులు ప్రకటన చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న అభయ ఘటన ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలు ఉండాలని, అందుకోసం  అపాయింట్‌మెంట్‌ కోరుతూ సీఎంవోకు మెయిల్‌ పంపారు. దీంతో.. వెంటనే ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయానికి రావాల్సిందిగా ప్రభుత్వం బదులిచ్చింది. 

ఇదీ చదవండి: అభయ ఘటన. నిందితుడి గురించి షాకింగ్‌ విషయాలు



 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)