Breaking News

‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’

Published on Tue, 04/22/2025 - 15:39

కోల్ కతా:  పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఈనెల తొలి వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేల మంది రోడ్డున పడ్డారు. ఈ తీర్పును ఇప్పటికే  ఖండించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మరోసారి ఉద్యోగాలు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చారు. ‘ మీ ఉద్యోగాలకు, మీ జీతాలకు  నేను గ్యారంటీ’ అంటూ మద్దతుగా నిలిచారు. నిరసన చేపట్టిన టీచర్లను బుజ్జగించే యత్నం చేశారు.  మిడ్నాపోర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘ ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కాదు అనే విషయంలో మీకు ఆందోళన వద్దు. ఉద్యోగం ఉందా.. జీతాలు సరైన సమయానికి పడుతున్నాయా లేదా అనే విషయం గురించే ఆలోచించండి. టీచర్లు నియామాకాల్లో పారదర్శకత సంబంధించి జాబితాను ప్రభుత్వం. కోర్టులు పరిశీలిస్తాయి,.  మీ  ఉద్యోగాలకు నేను గ్యారంటీ. తిరిగి స్కూళ్లకు వెళ్లి మీ విధులు నిర్వర్తించండి. ఈ విషయం గురించి గత రాత్రి నుంచి చాలాసార్లే మాట్లాడాను. నేను మీతో ఉన్నా’ అని మమతా బెనర్జీ తెలిపారు.  ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారి తరఫున రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని, అప్పటివరకూ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని మమత విజ్ఞప్తి చేశారు. 

కాగా, వెస్ట్‌ బెంగాల్‌లో 2016కు సంబంధించి ఉపాధ్యాయ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. 

మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం  ఆదేశించింది.

నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)