Breaking News

ఆగిన టన్నెల్‌ తొలిచే పనులు...ప్రమాదంలో 40 మంది ప్రాణాలు!

Published on Fri, 11/17/2023 - 21:03

ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌ కూలిన ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికులను కాపాడే రెస్క్యూ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రిల్లింగ్‌ మెషిన్‌ మళ్లీ మొరాయించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. టన్నెల్‌లోకి వెడెల్పైన స్టీల్‌ పైపులను పంపి చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారీ యంత్రంతో ఆరు రోజులుగా డ్రిల్లింగ్‌ చేస్తున్నారు.

టన్నెల్‌ డ్రిల్లింగ్‌ చేస్తూ శుక్రవారం ఆగిపోయిన యంత్రం రెండోది కావడం గమనార్హం. గురువారం ఒక యంత్రం డ్రిల్లింగ్‌ చేస్తూ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అధికారులు  మూడో యంత్రాన్ని ఇండోర్‌ నుంచి వాయు మార్గంలో తీసుకువస్తున్నారు. ఈ యంత్రం శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు సమాచారం. 

కాగా, ఆదివారం(నవంబర్‌ 12) ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చార్‌దామ్‌ రోడ్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల టన్నెల్‌లోని ఓ భాగం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తేన్న 40 మంది కార్మికులు టన్నెల్‌ కింద చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. అయితే టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌, ఆహారపదార్థాలు, నీరు పంపిస్తున్నారు. ఇప్పటివరకు వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఇదీచదవండి..ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ చెల్లదు : హర్యానా హై కోర్టు


 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)