Breaking News

వేడెక్కుతున్న ఆసియా.. భారత్‌లో వారికే ప్రమాదమే..

Published on Wed, 06/25/2025 - 07:25

పర్యావరణంపై ఓ కొత్త నివేదిక ఆసియాను ఆందోళన పరుస్తోంది. తీవ్రమైన వాతావరణ మార్పులు ఆసియాను సంక్షోభానికి గురి చేస్తాయని హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులపై ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల ‘స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమేట్‌ ఇన్‌ ఆసియా–2024’ను విడుదల చేసింది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకంటే ఆసియా రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని అధ్యయనం పేర్కొంది. ఈ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలను కలిగిస్తుందని హెచ్చరించింది. మంచి నీటి వనరులతో పాటు, తీర ప్రాంతాలకు ముప్పు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

వేగంగా కరుగుతున్న హిమనీనదాలు 
ఆసియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2024లో ఒకటిగా నమోదైందని నివేదిక తెలిపింది. 1991–2020 బేస్‌లైన్‌ కంటే సగటు ఉష్ణోగ్రతలు 1.04 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉన్నాయని పేర్కొంది. ఖండం ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మధ్య ఆసియాలోని హిమాలయాలు, టియాన్‌ షాన్‌ వంటి కీలక పర్వత శ్రేణుల్లో హిమానీనదాలు కరగడం వేగవంతం అయ్యింది. దీనివల్ల కీలకమైన మంచినీటి వనరులు, పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదం ఉందని వివరించింది.  

తీరప్రాంతాలకు ముప్పు.. 
ఆసియాలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని ‘స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమేట్‌ ఇన్‌ ఆసియా–2024’నివేదిక తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా, ఆసి యా పసిఫిక్, హిందూ మహాసముద్ర తీరప్రాంతా ల్లో సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరిగాయి. ఈ ధోరణులు భారత్‌తో సహా ఖండంలోని తీరప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలకు ప్రమాదమని పేర్కొంది. ఇవి వరదలు, తుఫానుల ప్రమాదాలను పెంచుతాయని వెల్లడించింది. 2024 ఆసియా ఖండం అంతటా తీవ్ర విపత్తులు సంభవించిన విషయం తెలిసిందే.  

తీవ్రమైన వేడి..
ఆసియాలోని కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా భారత్, జపాన్‌లను సుదీర్ఘమైన వేడి గాలులు తాకాయని తెలిపింది. ఇవి వందలాది మంది మరణాలకు కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. సముద్ర ఉష్ణ గాలులు రికార్డు స్థాయిలో 15 మిలియన్‌ చదరపు కిలోమీటర్లకు చేరుకున్నాయని, ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. ఈ సంవత్సరంలో ఉష్ణమండల తుఫాను యాగి ఆగ్నేయాసియా అంతటా విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. ఇది గత సెపె్టంబర్‌లో ఉత్తర వియత్నాంలో డజన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను బలిగొంది. అలాగే, మధ్య ఆసియా 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలను చవి చూసింది. ఎన్నడూ లేనంత వర్షపాతంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెపె్టంబర్‌ 2024లో నేపాల్‌ కూడా విపరీతమైన వరదలొచ్చాయి. 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సకాలంలో పనిచేయడం, పరిపాలనా వ్యవస్థలు సమన్వయంతో ప్రతిస్పందించడంతో వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగారు.  

తక్షణ లక్ష్యాలు..
ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తక్షణ వ్యూహాలు అత్యవసరమని నివేదిక సూచించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దేశాలన్నీ ఉమ్మడి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. పర్యావరణ మార్పుల వల్ల కలిగే మానవ, ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు చర్యలు చాలా అవసరమని, ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని రక్షించడానికి విపత్తు సంసిద్ధతను మెరుగుపరచాలని సూచించింది. ఇక రాబోయే ముప్పును గుర్తించడంలో జాతీయ వాతావరణ సేవలు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)