68 ఏళ్ల హరీశ్‌ సాల్వేకు మూడో పెళ్లి

Published on Tue, 09/05/2023 - 06:43

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే మూడోసారి పెళ్లి కొడుకయ్యారు. 68 ఏళ్ల జనరల్‌ హరీశ్‌ సాల్వే లండన్‌లో త్రినా అనే మహిళను వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా ఈ పెళ్లి వేడుకకు నీతా అంబానీ, సునీల్‌ మిట్టల్, లలిత్‌ మోదీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. హరీశ్‌ సాల్వేకు ఇది మూడో వివాహం. ఆయన మొదట మీనాక్షిని వివాహమాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనాక్షి నుంచి విడిపోయారు.

2020 జూన్‌లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం కరోలిన్‌ బ్రోసార్డ్‌ను పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఆమె నుంచి దూరమయ్యారు. ఇప్పుడు మూడోసారి త్రినాను పెళ్లాడారు. హరీశ్‌ సాల్వే 1999 నవంబర్‌ నుంచి 2002 నవంబర్‌ వరకూ ఇండియా సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు. టాటా గ్రూప్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్‌ వంటి ప్రఖ్యాత సంస్థల కేసులను వాదించారు. భారత ప్రభుత్వం 2015లో హరీశ్‌ సాల్వేకు ‘పద్మ భూషణ్‌’ పురస్కారం ప్రకటించింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో హరీశ్‌ సాల్వే సభ్యుడిగా ఉన్నారు.  

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)