Breaking News

కునాల్‌ కమ్రాకు ముంబై పోలీసుల ఝలక్‌

Published on Thu, 03/27/2025 - 12:42

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde)పై పేరడీ పేరిట కామెంట్లు చేసిన కేసులో స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రాకు ముంబై పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని.. విచారణకు హాజరయ్యేందుకు కాస్త గడువు ఇవ్వాలని కునాల్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.

షిండే పరువుకు భంగం కలిగించారనే ప్రధాన అభియోగంతో పాటు మరికొన్నింటిని కమ్రాపై ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మార్చి 31వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. ఒకవైపు ముందస్తు బెయిల్‌ ప్రయత్నాల్లో ఉన్న కునాల్‌ కమ్రా(Kunal Kamra).. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ గడువు పొడిగింపు కోరాడు. ఏప్రిల్‌ 3వ తేదీన విచారణకు హాజరవుతానని విజ్ఞప్తి చేశాడు. కానీ, పోలీసులు అందుకు అంగీకరించలేదు.

ముంబైలోని హాబిటాట్ స్టూడియో(Habitat Studio)లో జరిగిన ఈవెంట్‌లో కునాల్‌ కమ్రా ప్రదర్శన ఇచ్చాడు. ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్‌ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. వెంటనే బెయిల్‌ లభించింది.

షిండేపై కునాల్‌ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. థాక్రే శివసేన, ఎస్పీ పార్టీలు కునాల్‌కు మద్ధతుగా నిలిచాయి. షిండేకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం ఫడ్నవిస్‌ కోరగా.. అందుకు కునాల్‌ నిరాకరించాడు. కోర్టు కోరితేనే క్షమాపణలు చెబుతానంటూ తెగేసి చెప్పాడు. మరోవైపు కునాల్‌ వ్యంగ్యాన్ని తాను అర్థం చేసుకోగలనంటూనే.. దేనికైనా పరిమితి ఉంటుందంటూ షిండే మండిపడ్డారు. అదే టైంలో స్టూడియోపై తన పార్టీ విభాగం జరిపిన దాడిని ఖండిస్తూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.

ఈలోపు.. శివసేన(షిండే) ఎమ్మెల్యే ముర్జి పటేల్‌ ఫిర్యాదుతో మంబై పోలీసులు కునాల్‌ కమ్రాపై కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)