Breaking News

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో యూసీసీ బిల్లు

Published on Wed, 02/07/2024 - 01:48

డెహ్రాడూన్‌: అత్యంత కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ముందడుగు వేసింది. యూసీసీ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ మంగళవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అధికార బీజేపీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మంగళవారమే చర్చ, ఓటింగ్‌ జరగాల్సి ఉండగా, విపక్షాల నిరసనల వల్ల అది సాధ్యం కాలేదు. చర్చ జరగకుండానే బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్ష ఎమ్మెల్యే యశ్‌పాల్‌ ఆర్య మండిపడ్డారు.

యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఒకటి రెండు రోజుల్లో చర్చ, అనంతరం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. సభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో బిల్లు ఆమోదం పొందడం, గవర్నర్‌ సంతకంతో చట్టంగా మారడం లాంఛనమేనని చెప్పొచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ చరిత్ర సృష్టించింది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలవుతోంది. అక్కడ పోర్చుగీసు పాలనా కాలంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.  

ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఏముంది?  
► ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్‌ పౌరులకు ఈ బిల్లు వర్తిస్తుంది.  
► గిరిజన వర్గాల ప్రజలను బిల్లు నుంచి మినహాయించారు.  
► భారత రాజ్యాంగంలోని పార్ట్‌–21 కింద తమ హక్కుల రక్షణ పొందుతున్న వ్యక్తులకు, సమూహాలకు కూడా మినహాయింపు ఉంటుంది.  
► సహజీవనాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  

► సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధంగా గుర్తింపు లభిస్తుంది. 
► వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఒకే చట్టం అమలు చేస్తారు.   
► మతాలతో సంబంధం లేకుండా బహుభార్యత్వంపై నిషేధం అమలవుతుంది. ఒక్కరు ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.  
► ఎవరి మతాచారం ప్రకారం వారు వివాహం చేసుకోవచ్చు.  

► సహజీవనం చేసే స్త్రీపురుషుల వయసులు వరుసగా 18, 21 ఏళ్లకు పైబడి ఉండాలి.  
► సహజీవనం ప్రారంభించిన తర్వాత నెల రోజులలోపు ప్రభుత్వ రిజి్రస్టార్‌కు సమాచారం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. లేకపోతే వారికి ఆరు నెలల దాకా జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు.  
► సహజీవనంపై రిజిస్ట్రార్‌కు తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  

► సహజీవనం సాగిస్తున్న మహిళను పురుషుడు వదిలేస్తే బాధితురాలు కోర్టును ఆశ్రయించవచ్చు. అతడి నుంచి జీవనభృతి పొందవచ్చు.  
► పెళ్లి కాని జంటల మధ్య సహజీవనాన్ని అరికట్టేలా బిల్లులో పలు కీలకాంశాలు జోడించారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు