Breaking News

ఢిల్లీ ఘటన: అంతటా హై అలర్ట్‌

Published on Tue, 11/11/2025 - 08:48

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో కూడా భద్రతను పెంచారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని అన్ని రైల్వే స్టేషన్లకు కూడా హై అలర్ట్ ప్రకటించారు.

సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన భారీ పేలుడులో 10 మంది మరణించగా, 24 మంది గాయపడ్దారు. ఈ నేపధ్యంలో భద్రతా సంస్థలు దేశ రాజధాని అంతటా హై అలర్ట్ ప్రకటించాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ)విమానాశ్రయంతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని మెట్రో, రైల్వే స్టేషన్లకు హై అలర్ట్ ప్రకటించారు.

ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో..
ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్‌ సమీపంలో జరిగిన పేలుడు నేపధ్యంలో ఢిల్లీతోపాటు పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ , హర్యానాలలో తక్షణ హై అలర్ట్  ప్రకటించారు. అలాగే ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ తదితర నగరాల్లో నిఘా  పెంచడంతోపాటు భద్రతా తనిఖీలను ముమ్మరం చేశాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) ప్రత్యేక బృందాలతో పాటు ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు స్వభావాన్ని గుర్తించేందుకు ఆధారాలను పరిశీలిస్తున్నారు. 


 

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) ఢిల్లీలోని అన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భద్రతను అందిస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పేలుళ్ల తర్వాత న్యూఢిల్లీ, పాత ఢిల్లీతో సహా  చుట్టుపక్కల ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లను హై అలర్ట్‌లో ఉంచారు. ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) బృందాలతో పాటు డాగ్ స్క్వాడ్‌లను అన్ని స్టేషన్లలో మోహరించి, తనిఖీలు, నిఘాను ముమ్మరం చేశారు. అయితే రైలు సర్వీసులను నిలిపివేయలేదని షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఢిల్లీలో జరిగిన పేలుడు  దేశంలో భయాందోళనలు రేకెత్తించింది. దీంతో కోల్‌కతా, డెహ్రాడూన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్‌కతాలో పోలీసులు నగరం అంతటా ముమ్మర తనిఖీలను ప్రారంభించారు. హర్యానాలో ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా అధికారులను.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఉంచాలని, చారిత్రక ప్రదేశాలలో పర్యవేక్షణను పెంచాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా పోలీసులను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రదేశాలలో తనిఖీలు ముమ్మరం చేశారు.

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు తర్వాత భద్రతా చర్యలు గణనీయంగా పెంచామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా మీడియాకు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్, దాదర్, థానే, కళ్యాణ్ వంటి కీలక స్టేషన్లలో గస్తీని పెంచారు. డాగ్ స్క్వాడ్‌లు, బాంబు నిర్వీర్య బృందాలు అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేస్తున్నాయి. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని,  అనుమానాస్పద వస్తువులను తాకకుండా ఉండాలని అధికారులు సూచించారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)