Breaking News

వాతావరణశాఖ అలర్ట్‌: ఐదు రాష్ట్రాలకు రెడ్‌.. 16 రాష్ట్రాలకు ఆరెంజ్‌

Published on Mon, 07/01/2024 - 09:03

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్‌, 16 రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌తో పాటు ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి.

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా! 😍🦚

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)