Breaking News

కశ్మీర్‌ మూడో విడత పోలింగ్‌లో 68 శాతం ఓటింగ్‌

Published on Wed, 10/02/2024 - 04:06

జమ్మూ/శ్రీశ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి మూడో విడతలో మంగళవారం జరిగిన పోలింగ్‌లో 68.72 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల కమిషన్‌(ఈసీ) తెలిపింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు మించి జనం ఓటేశారు. లోక్‌సభ ఎన్నికల్లో  ఏడు జిల్లాల్లో 66.78% ఓటింగ్‌ నమోదైంది. ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించే బారాముల్లా, సొపోర్‌ అసెంబ్లీ స్థానాల్లో 30 ఏళ్లలోనే అత్యధికంగా ఈసారి జనం పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారని ఈసీ తెలిపింది.

అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జమ్మూకశ్మీర్‌లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా పశ్చిమ పాకిస్తానీ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు. అత్యధికంగా సాంబాలో 73.45%, ఉధంపూర్‌లో 72.91% మంది ఓటేయగా, కథువా లో 70.53%, జమ్మూలో 66.79%, బందిపొరాలో 64.85%, కుప్వారాలో 62.76%, బారాముల్లాలో 55.73% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

జమ్మూ జిల్లాలోని ఛాంబ్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 77.35 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఈసీ వివరించింది. సొపోర్‌ నియోజకవర్గంలో 41.44%, బారాముల్లా అసెంబ్లీ స్థానంలో 47.95% మంది ఓటు వేశారు. గత 30 ఏళ్ల ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికమని ఈసీ తెలిపింది. గతంలో ఇక్కడ తరచూ ఎన్నికలను బహిష్కరించే ఆనవాయితీ నడిచిందని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఓటింగ్‌ శాతం 63.45 అని ఈసీ పేర్కొంది. మూడో విడత పోలింగ్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ పేర్కొంది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, రీపోలింగ్‌ అవసరం కూడా లేదని వివరించింది. ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)