Breaking News

బాలాసోర్‌ రియల్‌ హీరోలు

Published on Sun, 06/04/2023 - 12:39

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎక్కడో దూరాన ఉంటూ, ఈ వార్త విని తల్లడిల్లిపోతున్నవారి సంగతి అలా ఉంచితే, అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారి మనోభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. రైలు ప్రమాద క్షతగాత్రులకు సహాయం అందించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న యువకులు మీడియాతో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో తాము ఎక్కడ కాలు మోపినా మాంసపు ముద్దలు, తెగిపడిన అవయవాలు కనిపిస్తున్నాయన్నారు. కొందరు క్షతగాత్రులు తమ ప్రాణాలు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారని తెలిపారు.

ఇలాంటి అరుపులు విన్నవెంటనే తాము పరిగెత్తుకుంటూ వెళ్లి బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. అలాగే కొన్ని వందల మృతదేహాలను వెలికితీశామన్నారు. బాధితులు వీరిని రియల్‌ హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి రియల్‌ హీరోలలో ఒకరైన 38 ఏళ్ల తుకన్‌ దాస్‌ మాట్లాడుతూ తాను ఇక్కడకు ఒక మందిరం నిర్మాణ పనుల నిమిత్తం వచ్చానని, రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తాను ఒక బోగీలోకి దూరి వెళ్లి చూడగా.. 60 మృతదేహాలు కనిపించాయని, అక్కడే  ఉన్న కొందరు ప్రయాణికులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారని అన్నారు.

వెంటనే తాను వీలైనంతమందికి సాయం అందించానని తెలిపారు. ఇదేవిధంగా స్థానికంగా ఉంటున్న కొందరు యువకులు రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ తాము 150కిపైగా మృతదేహాలను బయటకు తెచ్చామన్నారు. అలాగే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 288 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక కార్యకలాపలు కొనసాగుతున్నాయి.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)