Breaking News

వాహనాలపై ఆర్సీ రెన్యువల్‌ మోత 

Published on Fri, 02/21/2025 - 06:25

సాక్షి, న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (ఆర్సీ) రెన్యువల్‌ ఛార్జీలను భారీగా పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని కేంద్రం ఆమోదించిన వెంటనే 20 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను తమ వద్ద ఉంచుకోవాలనుకునే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

బీఎస్‌–2 ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలను ప్రజలు వదిలించుకోవాలనే కేంద్రం ఈ చర్యకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో 20 ఏళ్ల పైబడిన ద్విచక్ర వాహన రిజి్రస్టేషన్‌ రెన్యువల్‌కు రూ.2 వేలు, త్రీ వీలర్‌కైతే రూ.5 వేలు, కార్లు/జీపులకు రూ.10 వేలు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అంతేగాక 15 ఏళ్లు పైబడిన భారీ వాహనాలను దశలవారీగా రద్దు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం వాణిజ్య మీడియం ప్యాసింజర్‌/గూడ్స్‌ వాహనానికి రూ.12 వేలు, హెవీ ప్యాసింజర్‌/ గూడ్స్‌ వాహనానికి రూ.18 వేలు రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ ఛార్జీలుగా ప్రతిపాదించింది. 

అదే వాహనాలను 20 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ చేయించుకుంటే వాటి రుసుములను వరుసగా రూ.24 వేలు, రూ.36 వేలుగా రెట్టింపు చేస్తూ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో మాత్రం దీని ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 ఏళ్ల పైబడిన డీజిల్, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్‌ వాహనాలను తప్పనిసరిగా తొలగించాల్సి ఉన్న విషయం తెలిసిందే. 2021లో రోడ్డు రవాణా శాఖ మోటార్‌ సైకిళ్లు, త్రీ వీలర్లు, కార్ల రిజి్రస్టేషన్‌ రెన్యువల్‌ రుసుమును మాత్రమే పెంచింది. దీంతో, తాజాగా 20 ఏళ్లు దాటిన మీడియం, హెవీ ప్రైవేట్‌ కమర్షియల్‌ వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షల ఫీజును రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)