Breaking News

రతన్‌ టాటా కన్నుమూత.. నేడు సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Published on Thu, 10/10/2024 - 07:57

ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు.

కాగా రతన్‌ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేప్రకటించారు. దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవసూచికంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే నేడు జరగాల్సిన అన్నీ వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక రతన్‌ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీసీఏ)లో ఈరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. అక్కడ ప్రజలు ఆయనకు చివరి నివాళులు అర్పించనున్నారు. ఈజు సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్‌ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి.
చదవండి: వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్‌ టాటా' అస్తమయం

రతన్‌ టాటా మరణ వార్తతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమవారం రతన్‌ టాటా ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రెండ్రోజులకే ఆయన దివంగతులయ్యారు.

ఎందరికో స్ఫూర్తిదాత రతన్ టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం

Videos

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

50 భాషల్లో కళ్ళు చెదిరేలా మహేశ్ బాబు వారణాసి

సాక్షి ఇంపాక్ట్.. ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఫేక్.. ఖోఖో అసోసియేషన్ సంచలన లేఖ

గంటలో 104 మి. మీ వర్షం.. జపాన్ ను ముంచేసిన వరద

అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..

Photos

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)